ఖిద్మాట్ ఏ కల్క్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు.
జనం న్యూస్.సెప్టెంబర్ 14. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
హత్నూర మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ అయిన దౌల్తాబాద్ గ్రామంలో ఆదివారం ముస్లిం మైనారిటీ సోదరులు ఖిద్మాట్ ఏ కల్క్అధ్వర్యంలో మిలాద్-ఉన్- నబీ వేడుకలను ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.అనంతరం వృద్ధులకు. వితంతువులకు.ఖిద్మాట్ ఏ కల్క్ సంస్థ తరపున పెన్షన్లు అందజేశారు.ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ సతీష్.కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎమ్.ఏ.హకీమ్,మాజీ కోఆప్షన్ సభ్యులు రవూప్ఉద్దీన్ నాయకులు ఆమ్రాది జగదీష్.మాజీ వార్డ్ సభ్యులు గౌస్ పాషా.అరిగేసాయి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ మన భారత దేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ కుల మతాలకు అతీతంగా గంగా జమునా తహెజీబ్ లా కలిసి మెలిసి ఉండాలని కోరారు.మహ్మాద్ ప్రవక్త ఆయన చేసిన త్యాగాలు,సేవలగురించి ప్రజలకువివరించారు.ప్రతియొక్క ముస్లిం మైనార్టీ సోదరులు మహ్మాద్ ప్రవక్త చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దస్తగీర్. రహీం.నసీర్ పాషా.హశం అలీ.రఫీఉద్దీన్.ఇనాయత్ అలీ. సోహెల్.ముస్లిం మత పెద్దలు.యువకులు తదితరులు పాల్గొన్నారు.