జనం న్యూస్ సెప్టెంబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లి ఆలయ అర్చకులు సినీనటుడు పుష్ప సురేష్ శర్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి దుశ్శాలువా కప్పి ఆయన్ని అభినందించారు తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన పీపుల్స్ మీడియా నిర్మాతలకు , దర్శకులకు సురేష్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు
ఆలయ ప్రధాన అర్చకుడు ఆణివిళ్ల ఫణికాంత్ వేద ఆశీర్వచనం చేశారు ఈసందర్భంగా నటుడు సురేష్ శర్మను బ్రాహ్మణసంఘ నాయకులు డీసీసీ అధికార ప్రతినిధి కంచుస్తంభం సోనీ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, తాతపూడి గోపి, ఆణి విళ్ళ ఫణికాంత్ , శంకర్ దేవాసి ,ఈశ్వర్, రవివర్మ , రామకృష్ణ పరమహంస,పవన్, తంబి, తదితరులు సత్కరించారు .