జనం న్యూస్ సెప్టెంబర్ 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో స్థానిక విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ, "భూమి, జలం, అగ్ని, గాలి, బ్రహ్మ, విష్ణు, శివుడు, నక్షత్రాలు లేక శూన్యంగా ఉన్న సమయంలో తనలో తానే ఉద్భవించినవాడే విశ్వకర్మ. చరాచర జగత్తును సృష్టించినవారు విశ్వకర్మ. అలాంటి విశ్వకర్మ జయంతిని ప్రత్యేక పూజలతో జరుపుకోవడం సంతోషకరం" అని అన్నారు.కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సజ్జనపు రవీందర్, సభ్యులు సనుగుల చిరంజీవి, రమేష్, బ్రహ్మయ్య, స్వామి, శ్రీనివాస్, రాజేందర్, నర్సయ్య, సామాజిక సేవకుడుమూడ్ దయానంద్ తదితరులు పాల్గొన్నరు.