జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
జనం న్యూస్ జనవరి 29 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
కామారెడ్డి నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎం ఆర్ ఆర్ నిధులు రూ.4.32 కోట్లు రూపాయలు మంజూరుకు తన వంతు కృషి చేసి మంజూరు చేయించడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అనారోగ్యంతో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళే బాధితులకు ఎల్ ఓ సి లు, సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ వారికి బాసటగా షబ్బీర్ అలీ, నిలుస్తున్నారన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్దే లక్ష్యంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, వంటి సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని అధికారులకు,కాంగ్రెస్ శ్రేణులకు క్షేత్ర స్థాయిలో దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. రాష్ర ప్రభుత్వంలో సలహాదారుడిగా కీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి తగు సలహాలు, సూచనలు ఇస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా ప్రభుత్వం అమలు చేసే విధంగా లబ్దిదారులకు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.