జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం బోయలగూడెం గ్రామం గట్టు మండలంలో పత్తి మిరప పంటల్లో 9 గంజాయి మొక్కలను సాగుచేసిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగిందని గద్వాల్ సి.ఐ శ్రీను తెలిపారు.తేది:18.09.2025 నాడు నిందితుడు బోయలగూడెం శివారులో తాను కౌలుకు వేసుకున్న పొలంలో మిరప పంట & పత్తి పంటల మధ్యలో ఎవరికి అనుమానం రాకుండా, అక్రమంగా తన స్వలాభం కొరకు గంజాయి సాగు చేస్తున్నాడని నమ్మదాగిన సమాచారం మేరకు గట్టు యస్ ఐ మరియు సిబ్బంది , మరియు, అగ్రికల్చర్ ఆఫీసర్, రెవెన్యూ ఆఫీసర్, పంచాయత్ సెక్రేటరీ కలిసి బోయలగూడెం లోని 382/1 లో నేరస్థుడు మిరప పంట, పత్తి పంట లో అక్రమంగా సాగు చేసిన 9 గంజాయి మొక్కలను అందజా 5-6 ఫీట్ల ఎత్తులో ఉన్న (పచ్చి గంజాయి మొక్కల వేర్లు, ఆకులు, బెరడు అన్నీ కలిపి మూడు కేజీలు) వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొని క్రైమ్ నెంబర్: 144 /2025 /s 8(బి) ఆర్/డబ్లు 20 (ఎ) (బి) (ఐ) యన్ డి పి యస్ ఎ సి టి -1985 గా గట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయనైనది.నేరస్థుడు అయిన బస్వాపురం ప్రాణేష్ తండ్రి భీమన్న, వయస్సు: 21 సంవత్సరాలు, కులం: తెలుగు, ఓ సిసి: వ్యవసాయం, 3-18, తోతినోనిదొడ్డి గ్రామం, అయిజ మండలం ను ఈ రోజు 19.09.2025 గద్వాల సి ఐ. శ్రీను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి కోర్టు ఆదేశానుశారం జిల్లా జైలుకు పంపనైనది. గంజాయి సాగును పూర్తిగా అరికట్టడానికి పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయి. గంజాయి సాగు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. ప్రజలు కూడా మత్తు పదార్థాల నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఎక్కడైనా గంజాయి సాగు లేదా అక్రమ రవాణా లేదా విక్రయం కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.