జనం న్యూస్ సెప్టెంబర్ సెప్టెంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము
మా బంజారా (లంబాడీ) రిజర్వేషన్లను జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఏఐబీఎస్సెస్ మండల అధ్యక్షుడు భాదవత్ శర్మ నాయక్ ఘాటుగా హెచ్చరించారు.
మండల కేంద్రం భీంగల్లోని బంజారా భవన్లో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – బీజేపీ మాజీ ఎంపీ సోయం బాబురావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు గోండు తెగకు చెందినవారై, లంబాడీలను ఎస్టీ రిజర్వేషన్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం దారుణమని ఖండించారు.1976లోనే బంజారాలకు రిజర్వేషన్ అమలులోకి వచ్చిందని, 2022లో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ కల్పించిందని ఆయన గుర్తుచేశారు. “మా బంజారుల ఎదుగుదలను ఓర్చుకోలేక, చిన్నచిన్న రాజకీయ ప్రయోజనాల కోసం రిజర్వేషన్ తోలగించాలని ప్రయత్నించడం అసహ్యం” అన్నారు.తెలంగాణలో బంజారాల జనాభా 31 నుండి 40 లక్షల మధ్య ఉండగా, గోండు తెగకు జనాభా కేవలం రెండు లక్షలు మాత్రమేనని, వాస్తవాలు తెలియకుండానే బంజారా రిజర్వేషన్లపై మాట్లాడితే సమాజం ఊరుకోదని హెచ్చరించారు.“మా మనోభావాలను దెబ్బతీయడం మంచిది కాదు. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతాం. ఇప్పటికైనా మా రిజర్వేషన్ జోలికొస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది” అని మండల బంజారా సేవా సంఘం నాయకులు ఘాటుగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామావత్ తుక్కాజీ నాయక్, మాజీ కౌన్సిలర్ ధరావత్ లింగయ్య నాయక్, మాజీ సర్పంచ్లు భూక్యా సంతోష్ నాయక్, భాదవత్ తిరుపతి నాయక్, మాజీ ఎంపీటీసీ భూక్యా రాజు నాయక్, మండల ఉపాధ్యక్షుడు భూక్యా బాబులాల్ నాయక్, బంజారా సీనియర్ నాయకులు భూక్యా బుచ్చయ్య నాయక్, మాలవత్ మంగ్యా నాయక్, బానావత్ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.