
జనం న్యూస్ సెప్టెంబర్ 19: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్లమండలంలోని దోంచందా గ్రామంలోగురువారం రోజునా నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. దీనిలో భాగంగా కమ్మర్పెల్లి వ్యవసాయ కమిటీ డైరెక్టర్ కోరిపెల్లి లింగారెడ్డి పొలంలో సాగుచేస్తున్న RDR-1200 రకం వరి క్షేత్రాన్ని వీక్షించిన శాస్త్రవేత్తలు రైతులకు పలు సాంకేతిక సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సమతా పరమేశ్వరి, రాకేష్, కృష్ణ చైతన్య, సాయి చరణ్ గారు, వ్యవసాయ సహాయ సంచాలకులు భీంగల్ సాయి కృష్ణ , మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్, విస్తరాణాధికారి సాయి సచిన్, రైతులు ఇప్ప మల్లారెడ్డి, మద్దెల గంగారాం, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే అధిక సంఖ్యలో రైతులు హాజరై తమ అనుభవాలనుపంచుకున్నారు