హెచ్ఎం మహేశ్వర్
పాపన్నపేట, సెప్టెంబర్ 19.(జనంన్యూస్)
హిందీ భాష నేర్చుకుంటే దేశంలో ఏ మూలకైనా వెళ్లొచ్చని పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ వెల్లడించారు. శుక్రవారం పాపన్నపేట హిందీ ఉపాధ్యాయులు నింగప్ప, రియాజ్ ఆధ్వర్యంలో హిందీ దివస్ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆటల , పాటల పోటీలతోపాటు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులు బహుమతులు అందజేశారు, ఈ సందర్భంగా మల్లంపేట గ్రామానికి చెందిన సాయినాథ్రావు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. ఇందులో భాగంగా హిందీ ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజా గౌడ్, ప్రవీణ్ ,నాగరాజు, యాదయ్య వేణుగోపాల్ రెడ్డి, మోహన్ రావు, కృష్ణ కాంత్, నర్సింలు, శ్రీహరి , రవికాంత్, పిడి రమేష్, సుభాష్, విశ్వనాథ్, జాకీర, పద్మ లక్ష్మీ రజిత, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.