జనం న్యూస్ సెప్టెంబర్ 19 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
భారతదేశపు ఈశాన్యప్రాంతంలో అందమైన ప్రదేశాలతో కూడిన రాష్ట్రము మేఘాలయ. మేఘాలయ రాజ్ భవన్ లో జరిగిన 'ప్రజాడైరీ' మాసపత్రిక 25 వార్షికోత్సవ వేడుకల్లో వివిధ రంగాలలో పేరుపొందిన ప్రముఖులకు గవర్నర్ శ్రీ సి హెచ్ విజయ్ శంకర్ గారి చేతుల మీదుగా కళా పురస్కారం అందజేయడం జరిగింది..దీనిలో భాగంగా గత పది సంవత్సరాలుగా కాట్రేనికోన వాస్తవ్యుడు చిత్రకళా రంగాలలో అంజి అకొండి చేస్తున్న చిత్రాకళా సేవలకు గుర్తింపుగా గవర్నర్ చేతులు మీదుగా కళా పురస్కార్ అందుకున్నారు..
ఈ పురస్కారాలు అందుకున్న వారిలో చిత్రపరిశ్రమ నుండి ప్రముఖ సినీనటులు నటకిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ , చిత్రకళా రంగం నుండి కళాసాగర్ ఎల్లపు కూడా ఉన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా డైరీ వస్థాపకులు సురేష్ గారు పాల్గొన్నారు .