జనం న్యూస్,సెప్టెంబర్19, అచ్యుతాపురం
ఆర్అండ్ బి రోడ్డు విస్తీర్ణంలో భాగంగా రేపు కొన్ని ప్రాం తాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్,ఏఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అచ్యుతాపురం సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అయ్యే కె.వి లైన్లు మార్చడం వలన మోసయ్యపేట,చోడపల్లి, రామన్నపాలెం, కొత్తూరు మోసయ్యపేట, భోగాపురం రోడ్డు,ఎస్టిబిఎల్ కాలనీ, ఎలమంచిలి రోడ్డు, గాజువాక రోడ్డు, అనకాపల్లి రోడ్డు,
పూడిమడక రోడ్డు గల ప్రాంతాలకు 20వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, విద్యుత్ అంతరాయంకు వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.