
జనం న్యూస్ సెప్టెంబర్ 20, వికారాబాద్ జిల్లా
పరిగి మండలంలోని గడిసింగాపూర్ గ్రామానికి చెందిన మిట్టకోడూరు మల్లమ్మ (57), మల్లమ్మకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె, పెద్దకొడుకు అంజయ్య మద్యానికి బానిసై తల్లికి వచ్చిన పెన్షన్ డబ్బులు కోసం అడగగా తల్లి ఇవ్వకపోవడంతో పెద్దకొడుకు అంజలయ్య ఆగ్రహంతో ఇంట్లో ఉన్న ఒక కర్రతో మరియు గొడుగుతో విపరీతంగా కొట్టడం జరిగిందని మరియు కోట్టడంలో తల్లికి తీవ్ర గాయాలు రక్తం రావడంతో అక్కడే ఇంట్లో చనిపోవడం జరిగింది. చిన్న కొడుకు మిట్టకోడూరు మైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా నేరస్తుని విచారణ చేసి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండు కు తరలించడం జరిగిందని డి.ఎస్.పి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై మోహన్ కృష్ణ, పాల్గొన్నారు.
