
కమిషనర్ పరిశీలన..!
జనంన్యూస్. 20.నిజామాబాదు. ప్రతినిధి.
లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు పోలీస్ కమిషనర్ వెల్లడి.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS., భీంగల్ లోని శ్రీ లింబాద్రి గుట్టను దర్శించుకున్నారు.
అనంతరం రాబోయే లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రధానంగా భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలి. పార్కింగ్ ప్రాంతాలను సక్రమంగా గుర్తించి భక్తులను సులభంగా గమ్యస్థానానికి చేర్చేలా చూడాలి.
భక్తులకు తాగునీరు, వైద్య సహాయం, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా భక్తులకు మార్గదర్శనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ జాతర విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించబడేందుకు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ, స్థానిక సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా భీంగల్ సీఐ శ సత్యనారాయణ , భీంగల్ ఎస్సై సందీప్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
