జనం న్యూస్ జనవరి 28: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రము లోని తాళ్ళ రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుదవారం రోజునా ప్రార్థనా సమయంలో విద్యార్థులే తక్కువ అంటే దానికి తోడు ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో హాజరు కావడం మరో విశేషం, ప్రార్థనా జరుగుతున్న సమయంలో ఉపాధ్యాయులు రావడం చాలా చర్చనీయం అవుతుంది. దీన్నిబట్టి చూస్తే ఉపాధ్యాయులు సరిగా హాజరు కావడం లేదు అని విద్యార్థులకు బయం లేక వారు రావడం లేదు. ప్రార్థనా సమయంలో మరియు తర్వాత ఒకరొకరు మెల్లగారావడం జరిగింది. పై అధికారులు ప్రార్థనా సమయంలోఆకస్మికతనిఖీలు ఉంటే తప్ప ఈ మార్పు జరుగదు అని ప్రజలు అంటున్నారు.