
జనం న్యూస్ : సెప్టెంబర్ : 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
యుగాలుగా భారతీయుల్ని నైతికంగా, మానసికంగా పరవశింపచేసిన ప్రాచీన కళలైన తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ లాంటి అద్భుతాలను ఈ తరానికి తెలియచెప్పెందుకై చిత్రకళతో త్వరలో ప్రదర్శన నిర్వహించడానికి ప్రముఖ చిత్ర కారులు ఆకొండి అంజి పూనుకోవడం అభినందనీయమని ప్రముఖ రచయిత, శ్రీ శైలదేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు.వచ్చే ఫిబ్రవరి లో హైదరాబాద్ నెహ్రు ఆర్ట్ గాలరీ లో క్రియేటివ్ హార్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రాచీనకళల పునర్ వైభవ చిత్రకళా బ్రోచర్ ను శనివారం సాయంకాలం హైదరాబాద్ మధురానగర్ జ్ఞానమహాయజ్ఞకేంద్రం పవిత్ర ప్రాంగణంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పురాణపండ మాట్లాడుతూ గ్రాఫిక్స్, డిజిటల్ యుగంలో అంజి నిస్వార్ధంగా చిత్రకళతో చేస్తున్న సేవ ఆశ్చర్యపరుస్తోందని ప్రశంసించారు.ఆర్ట్ గాలరీ లో క్రియేటివ్ హార్ట్స్ చైర్మన్, చిత్రకారుడు ఆకొండి అంజి మాట్లాడుతూ త్వరలో ప్రాచీన కళల పునర్ వైభవం పై జాతీయ స్థాయిలో చిత్రకళల పోటీని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.