
(జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరపు శ్రీనివాస్)
జనం న్యూస్ సెప్టెంబర్ 20, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలోని ఈరోజు
బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ప్రిన్సిపాల్ బుర్ర ప్రసాద్ గౌడ్ - జయలక్ష్మి మేడం ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పిల్లలందరూ సంతోషంతో రకరకాల పువ్వులు సమకూర్చి టీచర్స్ యొక్క సహకారాలతో రంగు రంగుల బతుకమ్మ లు పేర్చడం జరిగింది. స్కూల్ యాజమాన్యం బతుకమ్మ పండుగ సందర్భంగా 10 అడుగుల పెద్ద బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చడం జరిగింది, బతుకమ్మ పండుగను ఉద్దేశించి జయలక్ష్మి మేడం మాట్లాడుతూ మన దేశంలో మన తెలంగాణలికి ఉన్న ప్రత్యేక పండగ, బతుకమ్మ పండగ అని ఈ ఓందంగా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుని మహిళల ఐక్యతను, మహిళల గౌరవాన్ని, ప్రకృతి ప్రేమను, సామాజిక సోదరభావాన్ని ప్రతిబింబించే ప్రత్యేక పండుగ అని అన్నారు, అంతేకాకుండా ఈ పండుగ భూమి, నీరు, ప్రకృతి వనరులతో వ్యక్తిగత అనుబంధాన్ని, పురాతన భారతీయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది అని బతుకమ్మ పండుగలో ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతీరోజూ మన సంప్రదాయ పదార్థాలు, రకరకాల పూలను ఉపయోగించడం ద్వారా, ప్రకృతి మీద ఆధారపడిన జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది అని ఈ పండగ నీ ప్రతి సంవత్సరం స్కూల్లో ఘనంగా జరపడం జరుగుతుంది అని, అందుకొరకే పండుగ విశిష్టత అందరికీ తెలియాలని 10 అడుగుల బతుకమ్మను తయారు చేయడం జరిగిందని తెలిపారు, ఉపాధ్యాయురాలు విద్యార్థినిలు బతుకమ్మ చుట్టూ వలయంగా తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ పండగను ఘనంగా జరుపుకున్నారు,ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.