
(జనం న్యూస్ 20 సెప్టెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల కేంద్రంలోని చౌదరి కాలనీ చెందిన నల్లాల రాజలింగు టేక్ వర్క్ షాప్ను అటవీ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని ఎఫ్ఆర్ఓ రత్నాకర్ రావు అధికారికంగా వెల్లడించారు
అదే గ్రామానికి చెందిన చింతల ప్రదీప్, మగ్గిడి జీవన్, చింతల రాజ్ కుమారులు స్థానిక అటవీ ప్రాంతంలో చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తుండగా అటవీ సిబ్బంది పర్యావేక్షిస్తూ పట్టుకున్నారు. విచారణలో ఇరవై ఒక్క చెట్లు నరికి తెచ్చిన టేకు దుంగలను నల్లాల రాజలింగు కు విక్రయించినట్లు ఒప్పుకున్నారు. దుంగల విలువ అక్షరాల 86426/- రూపాయలు ఈ కేసు కు సంబంధించి విచారణ నిమిత్తం తేది: 20/09/2025 అటవీ శాఖ మంచిర్యాల రేంజ్ ఆఫీసు వద్ద హాజరుకావాలని నోటీసు జారీ చేశారు