
జనం న్యూస్ సెప్టెంబర్ 20-09-2025 రిపోర్టర్ వినయ్ కుమార్
రేగోడు మండల కేంద్రంలోని పోచారం గ్రామం వద్ద తేదీ శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో రేగోడు పోలీస్ వారు ఎస్సై శంకర్ తన సిబ్బంది రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోచారం చౌరస్తా వద్ద పెద్ద తండా నుండి నారాయణఖేడ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం TS12UD5726 నీ తనిఖీ చేయగా అందులో సుమారు 25 నుంచి 30 క్వింటల్లా రేషన్ బియ్యం ఉండడంతో అట్టి బొలెరో వాహనాన్ని డ్రైవర్ తో పాటు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి శనివారం నాడు సివిల్ సప్లై అధికారు లు పరిశీలించి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న అట్టి బియ్యాన్ని మరియు వాహనాన్ని పంచనామా ద్వారా స్వాధీన పరుచుకుని, అట్టి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మెగావత్ రాజు నాయక్ పై కేసు నమోదు చేస్తున్నట్లు ఏఎస్ఐ శంకర్ అన్నారు ఆర్ ఐ విజయలక్ష్మి రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.