
జనం న్యూస్ సెప్టెంబర్ 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు నారాయణ సమక్షంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బెల్లం కొండా రాజేశ్వర్ యువజన ఉప అధ్యక్షులు కిషన్, అశోక్ మాజీ ఎంపీటీసీ మారుతీ కాంగ్రెస్ కర్యకర్తలుపాల్గొన్నారు.