
జనం న్యూస్.సెప్టెంబర్ 20.మెదక్ జిల్లా. నర్సాపూర్
నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బివిఆర్ఐటి సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 58వ ఇంజనీర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్ణు నేషనల్ లెవల్ 6 అవర్స్ కాడథాన్ బిల్డ్ విజన్ 2కె25.2వ ఎడిషన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబాయ్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రుధ్వి రాజు పెన్మెట్సా పి.స్నిగ్ధ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ అజైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాజరై విద్యార్థులను ఇంజనీరింగ్ ప్రాధాన్యత ఆవిష్కరణలపై ప్రేరేపించారు.ఈసంవత్సరం మొత్తం25 జట్లు పాల్గొనగా అందులో4జట్లుప్రతిష్ఠాత్మక కళాశాలల నుండి పాల్గొని తమ సృజనాత్మక మోడల్స్ డిజైన్ కాన్సెప్ట్లు ప్రాజెక్ట్ ఆలోచనలను ప్రదర్శించాయి.ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ డా.కె. లక్ష్మీ ప్రసాద్ ప్రిన్సిపల్ డా. సంజయ్ దూబే, కన్వీనర్ డా. ఎస్. కృష్ణరావు హెచ్ఓడి సివిల్ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు ఎస్.కలప్ప జె. శివరాజ్,ఎం.అభయ్ సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.ఇంజనీర్ల దినోత్సవం ఉత్సాహాన్ని ప్రతిబింబించడమే కాకుండా, యువ ఇంజనీర్లకు తమ ప్రతిభను భవిష్యత్ మౌలిక సదుపాయాలు సివిల్ ఇంజనీరింగ్ దిశపై తమ దృష్టిని ప్రదర్శించేందుకు ఒక అద్భుత వేదికగా నిలిచిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల హెచ్ హెచ్ఓడి డీన్స్ ఫాకల్టీ మెంబర్స్ కళాశాల మేనేజర్ బాపిరాజు. డాక్టర్ లక్ష్మీప్రసాద్.శ్రీనివాస్. సురేష్.మల్లికార్జున్ కాంతారావు. వివిధ విభాగాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
