
జనం న్యూస్ సెప్టెంబర్ 21 మండలం పెన్ పహాడ్ : మండల పరిధిలోని నారాయణ గూడెం పిఎసిఎస్ సహకార సంఘం, అనంతారం సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలకు మాత్రమే యూరియా ఇవ్వడం జరుగుతున్నదని పిఎసిఎస్ చైర్మన్ నాతాల జానకి రామ్ రెడ్డి, సీఈఓ సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. వాళ్లు మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని తమ దగ్గరలో ఉన్న పిఎసిఎస్ సెంటర్లో కూడా యూరియా అందుబాటులో ఉంటదని అన్నారు. పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలు నాగులపాడు, అనంతరం, మహమ్మదాపురం, పొట్లపాడు, దోసపాడు, ఎన్ అన్నారం, రాజుపేట, అనాజిపురం, సింగిరెడ్డిపాలెం గ్రామాల రైతులకు యూరియా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వచ్చే రెండు రోజుల్లో యూరియా రావడం జరుగుతుందని రైతులు పట్టాదారు ఆధార్ కార్డు పేరు ఉన్న రైతులు స్వయంగా వచ్చి యూరియా తీసుకోవాలని అన్నారు.