
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
దసరా,దీపావళి కానుకుగా జిఎస్టీ తగ్గింపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలుపుతూ కొత్తపేట పాత బస్టాండ్ లో సేవ పక్షోత్సవాలు మండల కన్వీనర్ కోటిపల్లి దామోదర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా పాల్గొన్న జనసేన కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జి బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం, కొత్తపేట పంచాయతీ ఉప సర్పంచ్ విళ్ళ మారుతీ,కంఠం శెట్టి శ్రీనివాస్, జనసేన మండల అధ్యక్షులు కంఠం శెట్టి చంటి, బీజేపీ మండల అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు తదితరులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం జనసేన నియోజకవర్గం ఇంచార్జి బండారు శ్రీనివాస రావు మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా పన్ను భారాన్ని తగ్గించాలని ఈ రోజు నుంచి జీఎస్టీ తగ్గింపు అమలు,కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మధ్యతరగతి ప్రజలకు ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షల అమాంతం పెంచి మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పేంది. మధ్యతరగతి ప్రజలకు మరియు తక్కువ ఆదాయం కుటుంబాలకు ఎక్కువగా వినియోగించే వస్తువుల పైన జిఎస్టి తగ్గించింది తద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలకు వస్తువులు తగ్గించి చౌకగా వస్తాయని కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గుతుందని దీనివల్ల కేంద్రంపై అధిక భారం 40 వేల కోట్ల నుండి 50 వేల కోట్ల రూపాయల వరకు పడుతుందని ప్రస్తుతం జీఎస్టీ వసూలు 2 లక్షల కోట్లు చేరుకోవడం దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉందని అయినా ప్రజల సంక్షేమమే పరమార్దంగా సామాన్యులకు నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా నిర్ణయం కేంద్రప్రభుత్వం తీసుకుందని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధికార ప్రతినిధి పాలూరి జయ ప్రకాష్ నారాయణ, నియోజకవర్గం బీజేపీ కన్వినర్ అయినవిల్లి సత్తిబాబు,ఛాంబర్ అఫ్ కమర్స్ సక్రటరీ ముత్యాల సత్యనారాయణ,టీడీపీ నాయకులు వాసంశెట్టి సత్యనారాయణ, గుబ్బల మూర్తి, చోడపనీడి ఉమా,శేకర్,పచ్చిపులుసు గుప్తా, చిక్కం శివాజీ,గొల కోటి వెంకటేశ్వరరావు, కుడిపూడి దావీదు, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, భమిడిపాటి లక్ష్మి నారాయణ, గవర బాబీ,బల్ల రాజు, అన్యాo సత్యనారాయణ, అన్యo మునేష్ ఎండూరి పవన్,అజ్జవరపు సత్యనారాయణ, తమ్మన సాయి ప్రసాద్, శ్రీగకొలపు కృష్ణ,సలాది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.