
జనం న్యూస్ :22 సెప్టెంబర్ సోమవారం: సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి : వై.రమేష్
జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షులు ఎన్నవెల్లి రాజమౌళి 314 పాఠశాలల్లో బాలవికాస యాత్ర పేరుతో పిల్లలకు కథలు, గేయాలు, పద్యాలు బోధించినందుకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కిందని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం అన్నారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో సత్కరించి, అవార్డు అందజేశారు. రాజమౌళి సాహిత్య కృషికి మరిన్ని అవార్డులు రావాలని కథాశిల్పి ఐతా చంద్రయ్య అన్నారు. కార్యక్రమంలో గరిపల్లి అశోక్, మల్లముల కనకయ్య, డబ్బికార్ సురేందర్, ఎడ్లలక్ష్మి భూంరెడ్డి, పెందోట వెంకటేశ్వర్లు, బస్వ రాజ్ కుమార్, వరుకోలు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.