
జనంన్యూస్. 22.నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు దుర్గా పరమేశ్వరి మాత మందిరము లో ఏర్పాటుచేసిన నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS.,దుర్గా దేవి అమ్మవారి పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా దేవీ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ నవరాత్రి ఉత్సవాల మొదటి దినం - బాల త్రిపుర సుందరి అలంకరణ సందర్భంగా " నవరాత్రులు నూతన శక్తి , భక్తి , విజయానికి ప్రతీకలు. ఈ పవిత్ర సందర్బంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ కార్యక్రమంలో పాల్గొనడం మనందరికి దైవానుగ్రహంగా భావించగలము. ఈ ఉత్సవాలు సమాజంలో శాంతి , సమరసత , సద్భావనలకు దోహదపడతాయని ఆశిస్తున్నాను అని అన్నారు. ప్రతి ఒక్కరికీ మాత అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూనట్లు తెలిపారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా భక్తులకు పోలీస్ కమీషనర్ స్వయంగా ఒడ్డించడం జరిగింది.ఈ సందర్భముగా అదనపు DCP ( అడ్మిన్ ) బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ( అడ్మిన్ ), ఎంటిఓ శేఖర్ బాబు ( MTO ), తిరుపతి ( వెల్ఫేర్ ), శ్రీ సతీష్ ( హోమ్ గార్డ్స్ ) మరియు దుర్గా పరమేశ్వరి మాత మందిరం ఆర్గనైజర్స్ సిబ్బంది, పోలీస్ కార్యాలయం సిబ్బంది , స్పెషల్ పార్టీ సిబ్బంది , ప్రధాన అర్చకులు జోషి వెంకటేష్ శర్మ తదితరులు పాల్గొనడం జరిగింది.
