జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జెవి.సంతోష్ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 114 ఫిర్యాదులు అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని అడిషనల్ ఎస్పీ సూచించారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందినటువంటి మొగిలి అద్దెయ్య అను అతనికి వెల్లటూరు రోడ్డు వినుకొండ రోడ్డులో మెస్సర్స్ విజయలక్ష్మి పెట్రోలియమ్స్ పెట్రోల్ బంకు ఉన్నట్లు, అయితే గత రెండు నెలల నుండి బొల్లాపల్లి మండలం గుట్లపల్లి గ్రామానికి చెందిన గోపి మరియు రామయ్య తిరువూరు డీజిల్ ను మినీ లారీలో ఎక్కడి నుండో తీసుకువచ్చి వారి పెట్రోలు బంకు పరిధిలో గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర కన్నా తక్కువ రేటుకు అల్ అధికారికంగా ఎటువంటి పర్మిషన్లు లేకుండా అవసరమైన చోట మరియు చుట్టుపక్కల పల్లెటూర్లకు డీజిల్ లారీని తీసుకువెళ్లి విక్రయాలు జరుపుతున్నట్లు దాని వలన అన్ని ఫీజులు ప్రభుత్వమునకు చెల్లించి అధికారికంగా పెట్రోల్ బంకు పెట్టుకున్న ఫిర్యాదికి ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నట్లు కావున వారిపై చర్య తీసుకుని అక్రమ డీజిల్ వ్యాపారాన్ని నిలుపుదల చేసి న్యాయం చేయవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ జి.బి.ఆర్ హాస్పిటల్ ప్రక్కన ఎంజే అసోసియేట్స్ అను పేరుతో అమీర్, అతని తండ్రి మస్తాన్, అతని సోదరుడు భాష అనువారు ఆఫీసు ఏర్పాటు చేసినట్లు,అంతట నరసరావుపేట పట్టణానికి చెందిన ఇనకొల్లు వాసు మరియు జొన్నలగడ్డ గ్రామానికి చెందిన సిలివేరి వేమలయ్య అనువారు (ఫిర్యాదులు) ఇద్దరు మరియు వారితోపాటు మరో నలుగురు స్నేహితులు కలిసి ఇండ్ల లోన్లు ఇప్పిస్తామని నమ్మించగా సుమారు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ఆ తదుపరి ఇండ్ల లోన్ ఇప్పించమని పలుమార్లు కోరిననూ అమీర్, అతని తండ్రి, అతని సోదరుడు లోన్ ఇప్పించకుండా మేము లోన్ ఇప్పించము, మీకు చేతనైంది చేసుకోండి, మీకు దిక్కు ఉన్న చోటు చెప్పుకోండి అని బెదిరించి ఈ డబ్బుల గురించి అడిగితే మీ ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నందుకు గాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తగిన న్యాయం చేయవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. మాచవరం మండలం నాగేశ్వర పురం తండా గ్రామానికి చెందిన గోగులోతు కుమారి భాయి చిల్లర షాపు నడుపుకొని జీవనం సాగిస్తున్నట్లు,అయితే పిల్లుట్ల గ్రామానికి చెందిన వేముల అంకమ్మ రావు @ అభి అను అతను ఐదు సంవత్సరాల క్రితం ఫిర్యాదిని ప్రేమిస్తున్నానని చెప్పి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానం నందు వేముల అంకమ్మ రావు తరుపున బంధువుల సమక్షంలో వితంతు వివాహం చేసుకున్నట్లు,ఫిర్యాది భర్త ఆయన వేముల అంకమ్మరావు ఫిర్యాది ని నమ్మబలికి వ్యవసాయ భూమి అయిన 0.50 సెంట్లు అమ్మగా వచ్చిన నగదు తీసుకున్నట్లు మరియు ఫిర్యాది దాచుకున్నటువంటి మూడు లక్షల రూపాయల నగదు ఫిర్యాది అత్త అయిన శివ పార్వతి మరియు ఫిర్యాది బావ అయిన వేముల పవన్ తీసుకొని ఫిర్యాది ని అసభ్యకరమైన పదజాలంతో దూషించి, కొట్టి నీకు దిక్కున చోట చెప్పుకో అని చెప్పి బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు,ప్రస్తుతం ఫిర్యాది మరియు ఫిర్యాది భర్త అయిన వేముల అంకమ్మ రావు సుమారు రెండు నెలల నుంచి వేరు వేరుగా జీవిస్తున్నట్లు, కావున ఫిర్యాది ని నమ్మించి మోసం చేసి ఇబ్బందులకు గురిచేస్తున్న ఫిర్యాది భర్త మీద మరియు అతని అనుచరుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.ముప్పాళ్ళ మండలం మాదల గ్రామానికి చెందిన ముత్తినేని నరేంద్ర అను వ్యక్తి సుమారు రెండు సంవత్సరముల క్రితం వ్యవసాయ అవసరాల నిమిత్తం 12 సవర్ల బంగారు వస్తువులను ముత్తూట్ ఫైనాన్స్ నందు తాకట్టు పెట్టి 5,00,000/- రూపాయలు లోన్ తీసుకున్నట్లు,తదుపరి వడ్డీలు 2,30,000/- రూపాయలు చెల్లించినట్లు,మిగిలిన కిస్తీ ల తాలూకా డబ్బులు పూర్తిగా చెల్లిస్తాను బంగారు వస్తువులు ఇవ్వమని ఫిర్యాది అడుగగా సదరు ముత్తూట్ ఫైనాన్స్ వారు బంగారు వస్తువులు కనబడుట లేదు అని ఇబ్బంది పెడుతున్నందుకు గాను వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఫిర్యాదు బంగారు వస్తువులు ఇప్పించవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.చిలకలూరి పట్టణం లోని M.V. నారాయణపురం ఆర్టీసీ కాలనీ నందు నివాసం ఉంటున్న దేవరపల్లి. ఝాన్సీ రాణి అను ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం. ఫిర్యాది మొదటి కుమారుడు ఇటీవలే మరణించగా, తన రెండవ కుమారుడైన తిరువీధుల చైతన్య,28 సం, అను అతను 2022 వ సంవత్సరంలో కృష్ణ డెలికేసి ఉడిపి వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్, పెబ్బేరు బైపాస్ లో ఉన్న హోటల్ నందు క్యాషియర్ పని చేయుటకు వెళ్లినట్లు, అప్పటినుండి ఇప్పటివరకు ఫిర్యాది కుమారుడి ఫోన్ రింగ్ అవుతున్నప్పటికీ ఎవరూ లిఫ్ట్ చేయకుండా ఉన్నట్లు, తరువాత ఫిర్యాది వెళ్లి హోటల్ యజమానిని అడుగగా కొద్ది రోజులు మా వద్దనే పనిచేసి తరువాత ఎటు వెళ్ళాడో తెలియదు అని చెప్పినట్లు,కావున వృద్ధాప్యంలో ఉన్న ఫిర్యాది భర్త ఆరోగ్యం సరిగా లేనందున తన కుమారుడి ఆచూకీ తెలిపి తన వద్దకు చేర్చవలసిందిగా అడ్మిన్ ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు. ఈ PGRS కార్యక్రమం నందు అదనపు ఎస్పీ (పరిపాలన) JV.సంతోష్ గారితో పాటు నరసరావు పేట మహిళా పోలీస్ స్టేషన్ DSP M.వెంకటరమణ పాల్గొన్నారు.