టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్
జనం న్యూస్. 23సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.
ఆసిఫాబాద్ పట్టణం : మీడియా స్వేచ్ఛను హరించిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) యం డేవిడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతి భాగోతాలు బయటపడతాయని భయంతోనే ఆసుపత్రిలో మీడియా పై ఆంక్షలు విధించారని ఆరోపించారు.ఆసుపత్రిలో మీడియాపై ఆంక్షలు ఎత్తివేయడంతో టీయూడబ్ల్యూజే కలెక్టరేట్ ధర్నా ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. కానీ మీడియా స్వేచ్ఛను ఆ గౌరవ పరిచి, మీడియా ప్రతినిధులను బెదిరించే విధంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ విషయం పై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కు ఫిర్యాదు చెయ్యనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ , టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ జమీల్ , జిల్లా సంయుక్త కార్యదర్శి అబ్దుల్ హన్నన్, పాత్రికేయులు హరికృష్ణ , ఎన్ తారు , షఫీ ఉల్లా బెగ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. డంప్ యార్డ్ తొలగించాలి ఆసిఫాబాద్ పట్టణంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కు ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలో మున్సిపల్ అధికారులు చెత్త, వ్యర్ధ పదార్థాలు డంపింగ్ చేస్తున్నారని , వెంటనే డంప్ యార్డ్ తొలగించాలి జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) యం డేవిడ్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ కోరారు. పక్కనే పాఠశాల ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ విషయాన్ని గమనించి వెంటనే చెత్త తొలగించాలని తెలిపారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి లోకేశ్వర్ రావు తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని అడిషనల్ కలెక్టర్ హామీ ఇచ్చారు.