
పాపన్నపేట. సెప్టెంబర్ 23, (జనంన్యూస్)
తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా లో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మంగళవారం ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ జూనియర్ కళాశాల గర్ల్స్ శిబిరంలో పాల్గొని ఆయుర్వేద ఔషధ మొక్కల గురించి ఆహారం నియమాల గురించి యోగా వల్ల ఉపయోగాల గురించి తెలుసుకున్నారు అనంతరం డాక్టర్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 10వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నాడు మన వైద్య శిబిరంలో విద్యార్థులతో పాటు ప్రజలు కూడా 78 మంది శిబిరాన్ని ఉపయోగించుకోవడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ ప్రోగ్రాం మేనేజర్ రవి చింతల తోపాటు డాక్టర్స్ లక్ష్మీనారాయణ డాక్టర్ రజిని డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ మధుమిత డాక్టర్ విజిత డాక్టర్ లావణ్య ఫార్మసిస్ట్ కిష్టారెడ్డి యూసుఫ్ ఎంఎన్ఓ జాఫర్ పెంటయ్య యోగ ఇన్స్పెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు
