
జనం న్యూస్ సెప్టెంబర్ 24 అమలాపురం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నుండి గడియార స్తంభం వరకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యతరగతి, సామాన్య ప్రజలకు వరంగా అందించిన జీఎస్టీ సదుపాయాలని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి జీఎస్టీ కొత్త టారిఫ్ విధానాన్ని ప్రకటించడం జరిగింది. ఈ కొత్త విధానం ద్వారా భారతదేశం పురోభివృద్ధి చెందుతుంది. పేద మధ్యతరగతి వర్గాలు ఉదయాన్నే ఉపయోగించే సబ్బు, టూత్ పేస్టు, పలు నిత్యవసర వస్తువులు కూడా జీఎస్టీ లో తగ్గించడం జరిగిందన్నారు. పాలు, పన్నీరు లాంటి మీద పూర్తిగా జీఎస్టీ రద్దు చేయడం జరిగింది. వ్యవసాయం కి సంబంధించి ట్రాక్టర్లు, విడి పరికరాలు, వ్యవసాయ పనిముట్లకు సంబంధించి 18 శాతం ఉన్న జీఎస్టీ ని 5 శాతం కి తీసుకురావడం జరిగింది అలాగే వైద్య రంగంలో క్యాన్సర్ తదితర వ్యాధులకు సంబంధించిన మందులకు జీఎస్టీ పూర్తిగా సున్నా శాతం కి తగ్గించడం చాలా మంచి పరిణామం అన్నారు. జీవిత బీమా, వైద్య బీమా లకు జీఎస్టీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది, దీని ద్వారా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు చాలా వరకు ఆదా అవుతుందన్నారు. ద్విచక్ర వాహనాలు కొనేవారికి 10 నుంచి 13 వేల రూపాయల వరకు ఆదా అవుతుందని, కారు అనేవారికి సుమారు లక్ష రూపాయల వరకు తగ్గుతుందని, నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారికి సిమెంటు ధరలు తగ్గించడం జరిగింది, ఇలా ప్రతి రంగానికి, ప్రతి వర్గానికి కూడా లబ్ధి చేరే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు అంబేద్కర్ కోనసీమ జిల్లా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు అయ్యల భాష, జిల్లా ప్రధాన కార్యదర్శులు సలాది వీరబాబు, కొప్పనాతి దత్తాత్రేయ, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, ఏఎంసీ డైరెక్టర్ కుడిపూడి సత్యవతి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శిలు రమావర్మ ,అనంతలక్ష్మి,గనిశెట్టి అరవింద్, ఈబీ స్వామి, కొండేటి జయలక్ష్మి, పావులూరి వెంకట్, సంసాని రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
