
జనం న్యూస్ సెప్టెంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని గట్లకానిపర్తి గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ అధ్యక్షులుగా బొమ్మకంటి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నతాధికారులు దృష్టి కి తీసుకెళ్ళి చేపించారు .స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో గట్లకానిపర్తి లో అంబేద్కర్ విగ్రహం, ప్రయానికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ నిర్మాణం చేయడం వంటివి చేపించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి అందాల్సిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ చేస్తున్నటువంటి కార్యక్రమాలను గుర్తించి జిల్లా కాంగ్రెస్ కమిటీ శాయంపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులుగా నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు గొర్రె మహేందర్ అందించారు .ప్రజా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు శాయంపేట మండల స్థాయిలో అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం రోజున ఎస్సీ కమీషన్ చైర్మన్ భూపాలపల్లి పర్యటనలో భాగంగా మాందారిపేట సెంటర్లో ఎస్సీ సబ్ ప్లాన్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది అన్నారు .కావున మండలం లోని అన్ని గ్రామాలకు చెందిన ఎస్సీ యువకులు పెద్దలు అధిక సంఖ్యలో హాజరై మీ మీ అభిప్రాయాలు తెలియజేయాలని తెలియజేశారు….