
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కు, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికినఅధికారులు, అర్చకులు
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంకొత్తమ్మ తల్లి ఉత్సవాలు మూడురోజులు ఘనంగా జరగనున్నాయని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు
జీఎస్టీ ప్రయోజనాలు వివరించేందుకు రాష్ట్ర వ్యప్తంగా 6వేలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్ట నున్నాం మంత్రి
ప్రజలకు, చిన్నారులకు, మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపిన మంత్రి
రూ. 80 లక్షలతో కోటబొమ్మాళి నుంచి సంతబోమ్మాళి ప్రధాన రహదారి సెంటర్ లైటింగ్ ప్రారంభించినమంత్రి
రాష్ట్ర స్థాయి ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభించిన గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్రపౌర విమానయాన శాఖమంత్రికింజరాపు రామ్మోహన్నాయుడు.
జనం న్యూస్ సెప్టెంబర్ 23 కోటబొమ్మాళి మండలం: శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. శతాభ్ది ఉత్సవాలు ఉత్సవాలను లాంచనంగా ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు , కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు . తొలుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పీ.ఎ.సీ.ఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్స్ మెంట్ ఓ.ఎస్.డి కింజరాపు ప్రభాకర్ కు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికిన.ఆలయ అధికారులు,అర్చకులు.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవపాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర స్ధాయి కొత్తమ్మతల్లి ఉత్సవాలు రెండో సారి నిర్వహించడం ఆనంతంగా ఉందని అన్నారు. శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర, నుండే కాకుంగా సమీపాన ఉన్న ఒరిస్సా, నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు. కొత్తమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజానీకంపై ఉండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర ప్రజలకు మరో పండగ వాతావరణం ప్రారంభమైందని అన్నారు.ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జీ.ఎస్టీ సంస్కరణలు
ప్రజల్లో సంతోషాన్ని నింపుతుందని అన్నారు. ముఖ్యంగా జీ.ఎస్టీ తగ్గడం వలన వ్యవసాయ రంగానికి అధిక శాతం ప్రయోజనం చేకూర నుందని అన్నారు. వ్యవసాయ రంగానికి ఎంతగానో దొహదపడుతుందని అన్నారు జీ.ఎస్టీ ప్రయోజనం అంశాలను రాష్ట్ర వ్యప్తతంగా నెల రోజులు పాటు 6వేలు సభలు ఏర్పాటు చేసి జీ.ఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నామని అన్నారు. రెండో రోజు నిర్వహించే
శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు. రూ. 80 లక్షలతో అభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించిన కింజరాపు అచ్చెన్నాయుడు, కోటబొమ్మాళి నుంచి సంతబోమ్మాళి ప్రధానచ రహదారి సెంటర్ లైటింగ్‌ను ప్రారంభించారు. హెలికాప్టర్ రైడ్ ,ప్రత్యేకంగా రూపొందించిన కోటబొమ్మాళి ఐకాన్ ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి,ఆర్డీవో కృష్ణమూర్తి, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.