
జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్.
రాష్ట్ర సహాయ కార్యదర్శి జమ్మిసేడ్ కార్తీక్ ఆధ్వర్యంలో,జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి.జమ్మిచేడు కార్తీక్ 4 నెలలు గడుస్తున్న జీతాలు ఇవ్వని ప్రభుత్వం ప్రతినెల 5వ తేదీ లోపల జీతాలు చెల్లించాలిగ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం. 19000 ఇవ్వాలని డియుండ్సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలిఈ సందర్భంగా జమ్మిచేడు కార్తీక్ మాట్లాడుతూ..గద్వాల జిల్లాలో 1100 మంది పైచిలుకు గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఏడాదికి మూడు జతల బట్టలు సబ్బులు నూనెలు ఇవ్వాలని లేనిపక్షంలో అలవెన్స్ రూపంలో ఇవ్వాలని వారు కోరారు. వయసు మీద పడిందని సాకుతో కార్మికులను మారిస్తే వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రతి వర్కర్ కు ఇన్సూరెన్స్ ఐదు లక్షల అమలు చేయాలి ప్రమాద భీమ కింద ఐదు లక్షల ఇవ్వాలని ఈ సందర్భంగా డిపిఓ ని కోరారు.అత్యంత మురికి పని ఆపరిశుభ్రంత కుడిన పనిని తమ సొంత పనిగా భావించి చేస్తున్నారు అని తెలిపారు. గ్రామ పంచాయితీ వర్కర్ స్ వల్ల ఈనాడు గ్రామాలన్ని పరిశుభ్రమయ్యాయిదీంతో దేశం లోనే తెలంగాణ రాష్ట్రానికి అనేక అవార్డులు వస్తున్నాయని వారు తెలిపారు. అలాంటివి బ్రోకర్లకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం 19వేల రూపాయలు చెల్లించాలని వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.మల్టీ వర్కర్స్ విధానాన్ని రద్దుచేసికార్మికులకు కావలసిన బూట్లు, గ్లౌజులు, రైన్ కోట్లు, మొదలగు వర్కర్లకు కావలసిన పనిముట్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.
జనాభా ప్రతిపాధన ఇప్పుడున్న జనాభా లేక్కల ప్రకారం కార్మికు లను పెంచాల్సిన ఆవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలి అతి తక్కువ వేతనాలు తీసు కుంటాం ప్రభుత్వం మల్టీపర్పస్ విధాన్నాని కాంట్రాక్ట్, ఆవుట్ సోర్సింగ్, నిర్దేశించిన వేతనాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వమే పి.ఆర్ సి 30% నివేదిక ప్రకారం కనీస వేతనం రు. 19000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచా యతీ వర్కర్స్ జిల్లా నాయకులు జుల్లకల్ మధు ఆకే పోగు రాకేష్ కొండపురం నరసింహులు పచ్చర్ల తిమ్మప్ప బజరమ్మ రాముడు దానయ్య మద్దిలేటి హలీం పాషా దానయ్య అసలు నర్సింహులు నరసప్ప పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.