
జనం న్యూస్ సెప్టెంబర్ 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతీ యువకులకు కూటమి పార్టీలు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకం ద్వారా మెగా డీఎస్సీ నిర్వహించి 16,467 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైల్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేసి కార్యాచరణకు ఆదేశాలు ఇచ్చారని, దాని ప్రకారం విద్యాశాఖ ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ పారదర్శకంగా అవినీతి, అక్రమాలకు, బంధుప్రీతికి, అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిరుద్యోగులకు కూటమి పై నమ్మకం కలిగిందని మాజీ శాసనమండలి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు,ఐటి విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ లకు హర్షం ప్రకటించారు. ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాలో 1134 మంది ఎంపిక అయ్యారని, వారందరికీ 25వ తేదీన విజయవాడలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదగా నియామక పత్రాలను అందజేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారని, ఎంపికైన ఉపాధ్యాయులను వినూత్నగా ప్రప్రదంగా విజయవాడకు బస్సులు అల్పాహారం భోజనం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతో ఉపాధ్యాయుల నియమక పత్రాలు తీసుకోవడానికి ఏర్పాట్లు చేయడం రాష్ట్ర చరిత్రలో ప్రప్రదంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ ఏర్పాట్లు జరిగాయని నాగ జగదీష్ అన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో 11 వేల 406 పోస్టులకు ప్రకటన చేసి ఒక్క పోస్టు కూడా పరీక్షలు నిర్వహించడం కానీ, ఎంపిక చేయడం గాని, అలాగే పోలీస్ ఉద్యోగాలు 6100 పోస్టులకు కూడా అన్యాయం చేశారని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నిరుద్యోగ యువతీ యువకులకు ఆశల పల్లకి ఎక్కించి వారిని నట్టేట ముంచారని, సమ్మిట్లు నిర్వహించి 13 లక్షల కోట్లతో పరిశ్రమలు వస్తున్నాయని చెప్పి ఆరు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపి ప్రభుత్వ ధనం 278 కోట్లు దుర్వినియోగం చేశారని, వారు ఉసిరే గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ధి చెప్పారని నాగ జగదీష్ అన్నారు. మెగా డీఎస్సీ ప్రకటించిన తర్వాత అనేక పర్యాయాలు హైకోర్టు సుప్రీంకోర్టులో తమ అనుకూలమైన వ్యక్తుల చేత డీఎస్సీను నిర్వహించకుండా 68 కేసులు జగన్ రెడ్డి గ్యాంగ్ చేత వ్యాజ్యాలు వేయించిన, న్యాయం ధర్మం కూటమి వైపు ఉండటం వల్ల యువతి యువకులకు న్యాయం జరిగిందని న్యాయం జరిగిందని, ఈ ఘనత అంతా నారా లోకేష్ కే దక్కుతుందని, వైసీపీ నాయకులు ఎన్ని కుట్ర కుతంత్రాలు కుయుక్తులు పన్నినప్పటికీ న్యాయం ధర్మపాలన వైపే మొగ్గు చూపించిందని నాగ జగదీష్ ఆనందం వ్యక్తపరిచారు. 25వ తేదీన జరగబోయే మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు నాగ జగదీష్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కాండ్రేగుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.