
జనం న్యూస్ సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి
అల్లవరం మండలంబోడసకుర్రు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా ఉచిత ఐ క్యాంపు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉచిత ఐ క్యాంపు ద్వారా గ్రామంలో ప్రజలకు కంటి పరీక్షలు మందులు, కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేసారు. జిఎస్టీ తగ్గింపు పై పేద ప్రజల్లో ఆనందం నెలకొందన్నారు.ఈ సందర్భంగా మోదీ ,నిర్మల సీతారామన్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, ఉపసర్పంచ్ అడపా వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు అడపా శ్రీను, మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి, బిజెపి జిల్లా కార్యదర్శి సుంకర సాయి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు దూరి రాజేష్, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ,టీడీపీ యువత అధ్యక్షులు ముత్యాల బాబీ,సొసైటీ డైరెక్టర్ మొయిల గణపతి,దొమ్మేటి రాధాకృష్ణ,అరవ చంటి, రేకాడి సత్యనారాయణ వర్మ, రొక్కాల నాగేశ్వరరావు,పాలక వర్గ సభ్యులు ఓలేటి పరమేశ్,చింతం శ్రీను,రోళ్ల శ్రీను, పంచాయతీ కార్యదర్శి బి ఆదిశంకరం, అరిగేలా వెంకట రామారావు, కూటమి నాయకులు,ప్రజాప్రతి నిధులు పంచాయతీ సిబ్బంది,సచివాలయం ఉద్యోగులు,హెల్త్ డిపార్ట్ మెంట్,ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
