
జనం న్యూస్ 26 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
కందుకూరుకు కదిలిన షాద్ నగర్ టీడబ్ల్యూజెఎఫ్ సైన్యం..స్థానిక మండల పరిషత్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన జర్నలిస్ట్ కేపీ కొత్తూరు వద్ద షాద్ నగర్ నియోజకవర్గ జర్నలిస్టుల బాజా భజంత్రీలతో ఘన స్వాగతం.. జ్యోతిరావు పూలే కు జర్నలిస్టుల నివాళులు..భారీ వర్షంలోను ఆగని జర్నలిస్టుల ర్యాలీ ప్రయాణం
యుద్ధం చేద్దాము రో.. సిద్ధం అవుదాంరో.. అంటూ భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జర్నలిస్టులు ముందుకు కదిలారు.. స్థానిక మండల పరిషత్ ఆవరణలో కలిశారు.. భారీ ఎత్తున వాహనాలలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం కందుకూరు వైపు కదిలారు.. జర్నలిస్ట్ కేపీ జెండా ఊపి ప్రారంభించిన ఈ కార్యక్రమం టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ ల ఆధ్వర్యంలో కొనసాగింది. వాహనాలలో భారీగా కొత్తూరుకు చేరుకున్న జర్నలిస్టులకు అక్కడి జర్నలిస్టులు భాజా భజంత్రీలతో స్వాగతం పలికారు. కూడలిలో జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం కందుకూరుకు కదిలారు. ఈ సందర్భంగా పట్టణ మండల పరిషత్ లో పాత్రికేయులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. కొందర్గు, కేశంపేట, జిల్లేడు చౌదరిగుడా, నందిగామ, కొత్తూరు మండలాలతో పాటు షాద్ నగర్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టులు కందుకూరుకు తరలిన వారిలో ఉన్నారు. భారీ వర్షం ఇబ్బంది పెట్టిన జర్నలిస్టులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం. సీనియర్ పాత్రికేయులు వేణుగోపాల్, లక్కాకుల రమేష్, మన్సూర్ అలీ ఖాన్, నరసింహారెడ్డి, రంగనాథ్ పెద్ద ఎత్తున నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు.