
జనం న్యూస్ 26 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు గద్వాల్ జిల్లా టియూసిఐ జిల్లా కమిటీ సమావేశంలో టి యూ సి ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్య మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 వేల మంది గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలల పెండింగ్ జీతాలు దసరా లోపు లేకుంటే ఉద్యమాలు చేపడతామని డిమాండు చేశారు గ్రామపంచాయతీ వర్కర్స్ కు కనీస వేతనం 19000 లు వర్తింపజేయాలని ఆపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పిఆర్సి అమలు చేయాలన్నారు.గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వాటర్ మాన్ కారోబార్ డ్రైవర్ సిఫార్సులు బిల్ కలెక్టర్లు తదితరుల వర్కర్స్ తమ హోదాను తీసేసి మల్టీపర్పస్ వర్కర్లుగా 2019 నుంచి గుర్తిస్తూ అందరికీ ఒకే విధంగా రూపాయలు 9500 వేతనాలు ఇస్తూ చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని ప్రభుత మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు ఆయన అన్నారు.సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు పిఆర్సి కమిషన్ సూచించిన ఈ విధంగా కనీస వేతనం 19,000 లు బేసిక్ వేతనాలు గా నిర్ణయించి వీటిపై 30% శాతం పిఆర్సి అమలు చేయాలని అన్నారు ప్రభుత్వం జారీచేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జీవో 60 ప్రకారం అయినా ప్రస్తుతం గ్రామపంచాయతీ వర్కర్స్ వివిధ కేటగిరీలో విభజించి కొత్త వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.కేటగిరి వారీగా జీతాల ఇవాలి గ్రామపంచాయతీ లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. పనిచేస్తూ చనిపోతే ఆ కుటుంబాలకు గ్రట్యుటీగాని ఇన్సూరెన్స్ కానీ అమలు కావడం లేదు తక్షణమే ఇన్సూరెన్స్ అమలు చేయాలి కార్మిక హక్కుల కోసం కార్మికులు ఉద్యమించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ చంద్రాములు పి డి యస్ యూ జిల్లా అధ్యక్షడు హరీష్. టియూసిఐ జిల్లా నాయకులు రంగన్న భీమన్న సిద్దయ్య వెంకటరామిరెడ్డి ప్రేమ రాజు శేషన్నలు పాల్గొన్నారు