
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట పట్టణం: అన్న క్యాంటీన్లలో అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యతను పరిశీలించేందుకు మున్సిపల్ ఛైర్మన్ రఫాని, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు ఈరోజు పట్టణంలోని అన్న క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్ రఫాని, కమిషనర్ శ్రీహరి బాబు అన్న క్యాంటీన్లలో ఆహారం స్వీకరిస్తున్న స్థానికులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. వారికి నాణ్యమైన టిఫిన్, భోజనం అందుతున్నాయా, లేదా అనే అంశాలపై ఆరా తీశారు.అనంతరం కమిషనర్ శ్రీహరి బాబు మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో పనిచేసే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా, వినియోగదారులకు నాణ్యత కలిగిన భోజనాన్ని అందించాలని, అలాగే క్యాంటీన్లలో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని ఆదేశించారు.అదేవిధంగా, అన్న క్యాంటీన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా మురుగునీరు నిలబడకుండా పారిశుద్ధ్య కార్మికులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ఈ సందర్భంగా ఛైర్మన్, కమిషనర్ స్పష్టం చేశారు.