
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట
మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదో రోజు శుక్రవారం దేవాలయంలో గల శ్రీ మహాలక్ష్మి దేవి పంచలోహ విగ్రహానికి 108 కళాశాలతో అభిషేకము ను దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి వైభవంగా నిర్వహించినారు. పాలు పెరుగు తేనె పంచదార పంచామృతాలతో పసుపు కుంకుమలతో అభిషేకం నిర్వహించి లక్ష్మి అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి గ్రామ పెద్ద జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి గట్ల భగవాన్ రెడ్డి కర్రు రాజేష్ రెడ్డి బాసని సుబ్రహ్మణ్యం నాగభూషణం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు…..