
భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 26 (:జనం న్యూస్)
పంజాబ్ గడ్డ ఇందిరమ్మ కాలనీలో శ్రీ కనకదుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల ఐదవ రోజు భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య భక్తిశ్రద్ధలతో అన్నదానం నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. నవరాత్రులు కులమతాలకతీతంగా జరుపుకునే ఉత్సవాలని, అందులో అన్నదానం విశేషమైనదని ఆయన పేర్కొన్నారు.అన్నదానంలో బస్తీ మహిళా సోదరీమణులు, స్థానిక యువకులు, భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మండలరాజు, కొరివి సురేష్, కృష్ణ కొత్తూరు, రవి, గోపి, మహిళా సమైక్య సోదరీమణులు, యువకులు పాల్గొన్నారు