
జనం న్యూస్ సెప్టెంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం వీరనారి, శ్రామిక పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం రజక సంఘం నేతలు ఎమ్మెల్యేకు మిఠాయి తినిపించి వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి బుజ్జన్న నాయకులు చిందం రవి బసాని మార్కండేయ వరదరాజులు రాజేందర్ దుబసి కృష్ణమూర్తి మామిడి సుదర్శన్ మండల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….