
జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి
దీన్ దయాళ్ ఉపాధ్యాయ109 జయంతి ఏకాత్మా మానవతావాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ జయంతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ప్రధాన కార్యదర్శి కొత్తలంకు సురేష్ ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నానాజీ మాట్లాడుతూ రాజకీయ నాయకుడు సమగ్ర మానవతావాద సిద్ధాంత ప్రతిపాదకుడు హిందుత్వ పునర్జీవనం యొక్క ఆదర్శాలను వ్యాప్తి చేయడానికి జాతీయ విధులు అనే అర్థం వచ్చేలా మాసపత్రికను ప్రారంభించారు మరో ముఖ్య అతిథి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వారపత్రిక పాంచ్ జన్య లక్నో దినపత్రిక స్వదేశ్ లకు సంపాదీయకులగా వ్యవహరించారు వికేంద్రీకృత రాజకీయ వ్యవస్థ స్వాలంబన దేశంగా ఉండాలని అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టా సూరిబాబు మండల యువమోర్చా అధ్యక్షులు మట్టా సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
