
బిఆర్ఎస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ రమేష్ జి
జనం న్యూస్ - సెప్టెంబర్ 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలపై నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మరియు స్థానిక సంస్థల కలెక్టర్ నారాయణ అమిత్ లకు వినతి పత్రం సమర్పించిన నందికొండ మున్సిపాలిటీ 5వ వార్డు మాజీ కౌన్సిలర్ రమేష్ జి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పిచ్చి మొక్కలు పెరిగి వెతకుప్పలు పేరుకుపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దోమలతో వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ఈ సమస్యల నుంచి ప్రజలను కాపాడాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి నందికొండ మున్సిపాలిటీ లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను త్వరితగతిన తీర్చాలని నందికొండ మున్సిపాలిటీ ప్రజల తరఫున తాము నల్లగొండ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.