
జనం న్యూస్ సెప్టెంబర్ 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.
అదేవిధంగా చెయ్యరు గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి ఆలయంలో నంద్యాల పెద్ద కాపు దంపతులు మరియు పలువురు మహిళలు కలిసి ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి కి కాత్యాయని దేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.బ్రహ్మశ్రీ ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత వినాయకుని పూజ, అమ్మవారి సంకల్పం, అష్టోత్తర పూజా కార్యక్రమం, కుంకుమార్చన, నీరాజనం మంత్రపుష్పాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల పెద్ద కాపు గారి దంపతులు, నంద్యాల వెంకట రెడ్డి , వెంకటలక్ష్మిగారి దంపతులు, నంద్యాల శివ, నంద్యాల తాతాజీ, కోనపరెడ్డి శివ పలువురు మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.అదేవిధంగా గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి యొక్క ఆలయంలో కూడా కాత్యాయని దేవి అలంకరణలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
