
జనం న్యూస్ సెప్టెంబర్ 29 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
బిజెపి, దీన్ దయాల్ శ్రవణ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వినికిడి మిషన్ల నమోద కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వేల్పుల వీధి కళ్యాణమండపంలో సేవా పక్షోత్సవాల్లో భాగముగా నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిలా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉచిత వినికిడి మిషన్ల కొరకు నమోదు కార్యక్రమం , వైద్య పరీక్షలు నిర్వహణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన వారు క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు కోరారు. వైద్య నిపుణులు రవితేజ, ఆడియోలాజిస్ట్ రాజు , టెక్నీషియన్ అరుణ్ , ఆడియో మైట్రేషన్ గోపిక లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 159 మందికి పరీక్షలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి బొడ్డేడ నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ , కె. తాతారావు, స్టేట్ కౌన్సిల్ సబ్యులు గల్లా రాజేశ్వరరావు, పలకా రవి, కొణతాల అప్పలరాజు, భానుమతి, నాగమణి మైచర్ల నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.