
జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట మండలం
ఆచార్య కొండా లక్ష్మణ బాపూజీ 110 జయంతి వేడుకలను మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో శనివారం రోజున ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను పద్మశాలి కులస్తులతో పాటు, బీసీ కులస్తులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ బేసి కులాల హక్కుల సాధనకోసం పోరాడిన మహనీయుడని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను గుర్తించి ఆయన జీవిత చరిత్రను ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతరత్న బిరుదును కూడా ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మండల శాఖ అధ్యక్షులు వంగరి సాంబయ్య, పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, పద్మశాలి జిల్లా కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ బాసని బాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు బాసని ప్రకాష్, నాయకులు రంగు మహేందర్, చిందం రవి,బాసని మార్కండేయ, శాంతా రవి, వలపదాసు చంద్రమౌళి, మామిడి మారుతి, బాసని సాయి కృష్ణ, తుమ్మ ప్రభాకర్, బాసని చంద్రమౌళి, శ్రీనివాస్, పరిమళ్ళ నోములేష్, చిందం సాయి , బాసని అఖిల్, చల్లా శ్రీనివాస్, బత్తుల శ్రీధర్,బీసీ నాయకులు వినుకొండ శంకరాచారి, తదితరులు పాల్గొన్నారు….