జనంన్యూస్. జనవరి. 29. నిజామాబాదు. ప్రతినిధి.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ విషయంలో నియమ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సూచించారు. పోలీస్.రవాణా శాఖ. ఆధ్వర్యంలో బుధవారం రోజున నగరంలోని శ్రావ్య గార్డెన్ లో ట్రాఫిక్ మీద అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒకరు తమ తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారికి హెల్మెంట్ గురించి అవగాహన చేయాలని కొందరు విద్యార్థులు అయితే పాఠశాల స్థాయిలోనే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారని వారి పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం జిల్లా జడ్జి సునీత కుంచాల. అదనపు కలెక్టర్ అంకిత్. జిల్లా రవాణా శాఖ కమిషనర్ దుర్గ ప్రమీల. ఏసీబీ రాజా వెంకటరామిరెడ్డి. డిసిపి బసవ రెడ్డి. మాట్లాడారు.
విద్యార్థులకు రూల్స్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిటిసి ఉమామహేశ్వరరావు. ఎం వి ఐ కిరణ్ కుమార్. పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.