
జనం న్యూస్ హయత్ నగర్ మండల రిపోర్టర్ అలంపల్లి దుర్గయ్య ::::: సెప్టెంబర్ 27
మేడిపల్లి నక్కర్త గ్రామ పరిశుద్ధ కార్మికులకు ప్రతీ సంవత్సరం లాగే ఏ వి జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి గణేష్ ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి కొత్త బట్టలు తీసుకోవడానికి తమ వంతుగా 18మందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. ప్రతీ సంవత్సరం ఇలాగే ఏ వి జి ఫౌండేషన్ తరుపున తమ వంతుగా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులు ఏ వి జి ఫౌండేషన్ చైర్మన్ ఆడాల వరలక్ష్మి గణేష్ లకు ధన్యవాదములు తెలియజేసారు