
జుక్కల్ సెప్టెంబర్ 27 జనం న్యూస్
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బి. శివధర్ రెడ్డినినియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను స్వీకరించారు.ఇప్పటివరకు డీజీపీ (ఇంటెలిజెన్స్)గా విశేష సేవలు అందించిన శివధర్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర పోలీస్ విభాగానికి ప్రధాన అధికారి అవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఈ సందర్బంగా జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నూతన డీజీపీ శివధర్ రెడ్డిని పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కిసి శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి దశలోనే శివధర్ రెడ్డి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకి అత్యంత సన్నిహితులు కాగా, అప్పటి రోజుల్లో ఎమ్మెల్యేకి సీనియర్గానూ ఉన్నారు. ఈ స్నేహం నేటికీ కొనసాగుతూ ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు.