
బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రం మార్కండేయ మందిరం లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు గంగులు శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు. శనివారం.మార్కండేయ మందిరం లోజరిగిన కార్యక్రమం లో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొని బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి అయన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథులు గా బిచ్కుంద మండల అధ్యక్షులు హనుమాన్లు పాల్గొని బాపూజీ సేవలను, తెలంగాణ సాధన మాలిదశలో కొండా లక్ష్మణ్ చేసిన పోరాటం గురించి వివరించారు. స్వాతంత్ర్య పోరాటం లో బాపూజీ బాపూజీ పాలు సార్లు జైలుకు వెళ్లారని అన్నారు.తెలంగాణ సాధనకోసం 95 ఏళ్ల వయస్సులో వణుకు పెట్టె చలిలో సైతం ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారని అన్నారు. ప్రభుత్వం అయన సేవలను గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని బోడ సాయిలు పేర్కొన్నారు. ఉద్యాన యూనివర్సిటీ కీ కొండలక్ష్మణ్ పేరు పెట్టారని అన్నారు.బాపూజీకి భారతరత్న బిరుదును ప్రకటించాలని బిచ్కుంద పద్మశాలి సంఘం సభ్యులు కార్యదర్శి చెర్ల బాలరాజు మహిళ అధ్యక్షులు పద్మ సంజీవని బోడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
