
జనం న్యూస్ సెప్టెంబర్ 27,
వికరాబాద్ జిల్లా పూడూరు మండలంలో పలు గ్రామాల్లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంట సుమారుగా వంద ఎకరాలకు నష్టం జరిగిందని, ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి రైతు పొలాల వారీగా పంట నష్టం నమోదు చేయడం జరుగుతుంది. రైతులు తమ పొలాలలో నీళ్లు నిల్వకుండా నీటిని బయటకు వెళ్లే విదంగా నిలువ ఉండకుండా పోయే విధంగా చూసుకోవాలని, పూడూరు మండల వ్యవసాయ అధికారి తులసి రామ్ అన్నారు.