
జనం న్యూస్ 27 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గద్వాల నియోజకవర్గంలోని 5 మండలాల్లో దళితులు లేరా ? ఏ ఒక్క మండలంలో కూడా దళితులకు ఎందుకు జడ్పిటిసి ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. పిడిఎస్ యూ గంజిపేట రాజు బి ఆర్ యస్
పార్టీ జిల్లా యువ నాయకులు.జోగులంభ గద్వాల జిల్లా. ఈ సందర్భంగా గంజిపేట రాజు మాట్లాడుతూ.. నేడు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ ప్రక్రియను తీయడం జరిగింది.అయితే గద్వాల నియోజకవర్గంలో ఐదు మండలాలలో ఎక్కడ కూడా దళితులు ఓటర్లు లేరా ? ఈఐదు మండలాల్లో ఏ ఒక్క గ్రామంలో గానీ,మండలలలో గానీ,ఏ పల్లెలలో గానీ దళిత ఓటర్లు లేరా ? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళులేని కబోధిలా దళితుల పట్ల వివక్ష వ్యవహరిస్తోంది.ఈ ఐదు మండలాలు ఏ ఒక్క మండలంలో కూడా జెడ్పిటిసి మరియు ఎంపీపీ స్థానాలలో దళితులకు ఎందుకు ఖరారు చేయలేదు.
దళితుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వివక్షకు దిగడం సిగ్గుచేటు.దళితుల పట్ల రాజకీయ కక్ష పూరితమైన కుట్రలో భాగంగానే గద్వాల నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఒక్క మండలంలో కూడా జడ్పిటిసి ఎంపీపీ రిజర్వేషన్లు కల్పించలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్నికి దళితుల పట్ల ఉన్న వివక్ష ఏంటో తేలిపోయింది అన్నారు.ఈ రిజర్వేషన్లు కేవలం కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా అమలుపరచారు.
సమాజానికి రాజ్యాంగం అందించే రాజకీయ సమాన హక్కులు,గౌరవాన్ని,దళితులు పొందకుండా నిర్వీర్యం చేసే కుట్రకు తెర లేప్పింది ఈ కాంగ్రేస్ ప్రభుత్వం.తక్షణమే జెడ్పిటిసిలు ఎంపీపీ రిజర్వేషన్ ప్రక్రియను నిలుపుదల చేసి మరల ఈ రిజర్వేషన్ సవరణ చేసి దళిత సామాజిక వర్గానికి ఎంపీపీ రెండు జెడ్పిటిసిలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.