
జనం న్యూస్ 27 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలోని విలేకరుల సమావేశంలో బండారి సునంద్ మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గంలో కనీసం ఎస్సీలకు ఎంపీపీ లలో మరియు జడ్పిటిసి లలో ఒక్క రిజర్వేషన్ కూడా కల్పించకపోవడం అనేది ఎంత మూర్ఖత్వమైన చర్య అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని బండారి సునంద్ అన్నారు.అదేవిధంగా గట్టు మండల జడ్పిటిసి అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గం చెందిన వారున్నారు అలాంటి మండలంలో కూడా ఓసి వర్గానికి కేటాయించడం ఎంతవరకు సమన్వయము ఒకసారి పునరాలోచన చేసుకొని రిజర్వేషన్ మార్చాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి న్యాయం లో జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ 42 శాతం రిజర్వేషన్ గద్వాల్ నియోజకవర్గంలో కనిపించడం లేదని అన్నారు.0.80శాతం ఉన్న ఎస్టి లకు జిల్లా లో ఒక్కటైన జడ్పీటీసీ లేదా ఎంపీపీ స్థానాలు కల్పించాలి అదేవిధంగా జనాభాపరంగా ఒక మండలంలో ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు కొన్ని మండలాలు కేటాయించాలీ కానీ ఒక్క పర్సెంట్ లేని వాళ్ళ ఓసీలకు కల్పించడం అనేది చాలా హేయమైన చర్యగానే భావిస్తున్నాం.కాబట్టి తక్షణమే మార్చి కొత్త రిజర్వేషన్ మళ్ళీ ప్రకటించకపోతే కచ్చితంగా మేము కోర్టుకు వెళ్లాల్సిన సందర్భం ఉన్నది. రాజ్యాంగబద్ధంగా ఉండాలి గాని రిజర్వేషన్లు ఇవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం కాబట్టి తక్షణమే రిజర్వేషన్స్ మార్చి మళ్లీ కొత్త రిజర్వేషన్స్ ప్రకటించాలని కోరుతున్నామని బండారి సునంద్ అన్నారు.